- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డీసీఎంలో భారీగా గంజాయి..
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలో భారీగా గంజాయి పట్టుబడింది. శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా సుమారు 100 కిలోల గంజాయి పట్టుబడింది. వయనాడ్‌లోని తోల్‌పెట్టి చెక్ పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు రోజుమాదిరిగానే తనిఖీలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఓ డీసీఎం అనుమానాస్పదంగా వస్తుండటాన్ని గమనించిన అధికారులు దానిని ఆపారు. అనంతరం చెక్ చేయగా అందులో 100కిలోల గంజాయి లభ్యమైంది. మొత్తం 4సంచుల్లో తరలిస్తున్న గంజాయిని సీజ్ చేశారు.
గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, ఆ వాహనాన్ని కూడా సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఆ గంజాయిని ఎక్కడి నుంచి తెచ్చి, ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు.
Advertisement
Next Story