భర్తలతో కలిసి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్న స్టార్ హీరోయిన్లు.. ట్రెడిషనల్ లుక్‌లో కట్టిపడేస్తున్నారుగా

by Anjali |
భర్తలతో కలిసి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్న స్టార్ హీరోయిన్లు.. ట్రెడిషనల్ లుక్‌లో కట్టిపడేస్తున్నారుగా
X

దిశ, వెబ్‌డెస్క్: నిన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సినీ సెలబ్రిటీస్ కూడా షూటింగ్స్ పక్కన పెట్టి.. ఫ్యామిలీ మెంబర్స్‌తో గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ క్రమంలో రీసెంట్‌గా పెళ్లైన కొత్త జంటలు సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలుస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ దంపతులు, అమలాపాల్.. వీరితో పాటు నయనతార దంపతుల ఫొటోలు నెటిజన్లను మరింత ఆకట్టుకుంటున్నాయి. వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లో నయన్-విఘ్నేష్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ్ల కూడా పెళ్లాయ్యాక మొదటి సంక్రాంతిని అత్తారింట్లో జరుపుకుంది. ఇళ్లను పూలతో అందంగా అలంకరించి.. పాలు పొంగిస్తూ వంటలు వండుతూ ఈ న్యూ కపుల్స్ పండగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మల పోస్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story