Shocking: పెను విషాదం.. బంగారు గణిలో చిక్కుకొని 100 మంది కార్మికులు మృతి

by Ramesh Goud |
Shocking: పెను విషాదం.. బంగారు గణిలో చిక్కుకొని 100 మంది కార్మికులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: దక్షిణాఫ్రికాలో(South Africa) తీవ్ర విషాదం నెలకొన్నది. బంగారు గని(Golden Mine)లో చిక్కుకొని దాదాపు 100 మందికి పైగా కార్మికులు మృతి(Died) చెందారు. దక్షిణాఫ్రికాలోని స్టిల్ ఫాంటైన్ (Stil Fantine)ప్రాంతంలో పాడుబడిన బంగారు గనిలో కొందరు వ్యక్తులు అక్రమంగా బంగారం మైనింగ్ చేపడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు బంగారు గనిలో సోదాలు నిర్వహించారు. ఈ తనికీలలో సంచలన విషయాలు వెళుగులోకి వచ్చాయి. బంగారు గనిలో చిక్కుకొని దాదాపు 100 మందికి పైగా చనిపోయినట్లు బ్రిగేడియర్ అధికారులు(Brigediar Officer) గుర్తించారు. అంతేగాక గనిలో చిక్కుకొని ఉన్న మరికొందరు కార్మికులను రెస్క్యూ టీం రక్షించారు. బంగారు గనిలో చిక్కుకున్న వారిలో మైనర్లు, ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న అధికారులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిపై అక్రమ మైనింగ్ అతిక్రమణ కేసులతో పాటు ఇమ్మిగ్రేషన్ కేసులు నమోదు చేయనున్నామని అక్కడి బ్రిగేడియర్ అధికారి మాతే వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed