- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Sankranthiki Vasthunnam : దిల్ రాజుపై ఐటీ దాడుల ఎఫెక్ట్ .. మరి, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ ఈవెంట్ ఉంటుందా?

దిశ, వెబ్ డెస్క్ : దిల్ రాజు నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా " గేమ్ ఛేంజర్ ". ఈ మూవీని రూ. 450 కోట్లు పెట్టి తెరకెక్కించారు. ఈ పొంగల్ కి రామ్ చరణ్, బాలయ్య, వెంకటేష్ తలపడగా ' సంక్రాంతికి వస్తున్నాం " ( Sankranthiki Vasthunnam ) మూవీ పెద్ద హిట్ అయింది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 14న ఆడియెన్స్ ముందుకొచ్చింది. మొదటి రోజు ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకువెళ్తుంది. ముఖ్యంగా, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా అలరించింది. ప్రస్తుతం, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తుంది. ఇప్పటికే ఈ మూవీ రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసింది.
హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించిన సక్సెస్ ప్రెస్ మీట్ ఈవెంట్ నిర్వహించారు. త్వరలో ఆంధ్రలో కూడా సక్సెస్ ఈవెంట్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, మంగళవారం ఉదయం నుంచి నిర్మాత దిల్ రాజుపై ( Dil Raju ) ఐటీ దాడులు జరిగాయి. జనవరి 25 సాయంత్రం వైజాగ్ లో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు చిత్ర బృందం. త్వరలోనే దీన్ని అధికారికంగా ప్రకటిద్దాం అనుకున్నారు. అలాగే అనిల్ రావిపూడి ఆఫీస్ పై కూడా ఐటీ దాడులు జరిగినట్టు తెలిసిన సమాచారం. దీంతో, వైజాగ్ లో జరగాల్సిన " సంక్రాంతికి వస్తున్నాం " మూవీ సక్సెస్ ఈవెంట్ చేస్తారా? చెయ్యరా? అనే సందేహం ఉంది.