- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
వైన్ షాప్ లో కేఎఫ్ బీర్లు నిల్.. బెల్ట్ షాపుల్లో ఫుల్...
దిశ, వర్ధన్నపేట (రాయపర్తి) : మండలం కేంద్రంలోని తిరుమల వైన్స్ నిర్వాహకులు సిండికేట్ దందా కొనసాగిస్తున్నారు. వైన్ షాపులో బీర్ల కొరత సృష్టించి బెల్ట్ షాపులకు తరలిస్తూ ప్రతి బాటిల్ పై 20 నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రాయపర్తి మండల కేంద్రంలోని తిరుమల వైన్స్ కు యువకులు కేఎఫ్ బీర్ల కోసం వెళ్ళారు.
బీర్లు లేవంటూ వైన్స్ నిర్వహకులు చెప్పడంతో ఆగ్రహించిన యువకులు బీర్లకు వైన్స్ షాపులో కొరత సృష్టించి బెల్ట్ షాపులకు తరలిస్తున్నారని షాపు ముందు గొడవకు దిగారు. రాయపర్తి మండలం కేంద్రంలో ఉన్న రెండు వైన్స్ షాపులలో ఒక వైన్స్ ను సిండికేట్ గా మార్చి అమ్మకాలు జరుపుతున్నారు. ఇదంతా తెలిసినా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.. ఏదేమైనప్పటికీ ఎక్సైజ్ అధికారులు ప్రతి నెలా ముడుపులు తీసుకుని సైలెంట్ గా ఉంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.