- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
నిజాలు నిర్భయంగా రాసే పత్రిక దిశ.. పల్లె గంగారెడ్డి..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తూ దిశ పత్రిక అనతి కాలంలోనే పాఠకుల విశ్వాసాన్ని చూరగొందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. నిజాలు నిర్భయంగా రాసే విషయంలో దిశ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిందని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరం ఆర్య నగర్ బ్యాంకు కాలనీలోని పసుపు బోర్డు కార్యాలయం వద్ద ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బ్యూరో చీఫ్ ఆడెపు శ్రీనివాస్, బీజేపీ కార్యకర్తలతో కలిసి దిశ పత్రిక న్యూ ఇయర్ 2025 సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ మార్కెట్లో ఇప్పటికే పాఠకుల ఆదరణ పొందిన పత్రికలకు పోటీగా గట్టిగా తట్టుకుని నిలబడటం దిశ కే చెల్లిందని గంగారెడ్డి అన్నారు. దిశ పత్రికను తాను ఆన్ లైన్ లో ప్రతిరోజు చూస్తానన్నారు. డైనమిక్ ఎడిషన్ లో వచ్చే తాజా వార్తలు కూడా అప్ డేట్స్ తెలుసుకోవడానికి చూస్తానన్నారు. దిశ పత్రిక యాజమాన్యానికి, పాఠకులకు, జిల్లా ప్రజలకు జాతీయ పసుపు బోర్డు చైర్ పర్సన్ పల్లె గంగారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.