- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ రాశి వారు అలా చేసినందుకు బాధ పడుతారు
తేది : 21, జూలై 2021
ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : ద్వాదశి
(నిన్న రాత్రి 7 గం॥ 17 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 26 ని॥ వరకు)
నక్షత్రం : జ్యేష్ట
(నిన్న రాత్రి 8 గం॥ 32 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 6 గం॥ 30 ని॥ వరకు)
యోగము : బ్రహ్మము
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 39 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 6 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 10 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 53 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 47 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 58 ని॥ వరకు)
మేష రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే మరింత కష్టపడాలి. నూతన స్నేహితులు పరిచయం అవుతారు. ఇంటికి కొత్తగా పాప బాబు రాబోతున్నారు ఆనందించండి. ఇంట్లో శుభకార్యాలు. ఇతరులను సంతోష పెట్టడానికి లేనిపోని వాగ్దానాలు చేయకండి దాని వలన ఇబ్బందులు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. కావాల్సినంత ధనం చేతికి అందడం వలన మనశ్శాంతి. విద్యార్థులు తమ భవిష్యత్ చదువుల కై సరైన ప్రణాళికలు వేయండి. వ్యాపారస్తులకు నూతన పథకాలలో పెట్టుబడుల వలన లాభాలు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు గొడవ పడటం మానేసి పాత విషయాలను మర్చిపోయి వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు గడపండి.
వృషభ రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే ధైర్యం పట్టుదల అవసరం వ్యాపారస్తులు లాభాల కొరకు కొంత కాలం వేచి ఉండండి. గందరగోళం వదిలేయండి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయడానికి మరింత శ్రమ పడాలి. మీ సామర్థ్యాన్ని ఉపయోగించండి. అప్పులు చేయడం ఎంత తప్పో ఈ రోజు అప్పు తీరుస్తున్నప్పుడు తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆదాయం పరవాలేదు అనవసరపు ఖర్చులను వదిలివేయండి ఈ రాశి స్త్రీల కి ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.
మిధున రాశి: అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆత్మవిశ్వాసము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొంతమందికి ప్రమోషన్. వ్యాపారులకు లాభాలు. మానవసేవే మాధవసేవ. అవసరం ఉన్న వాళ్లకి సహాయం చేయండి దాని వలన దైవ బలం. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపడం లేదని మానసిక అశాంతి.
కర్కాటక రాశి: ఆత్మవిశ్వాసంతో సరైన ప్రణాళికతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆఫీసులో అదనపు బాధ్యతలు వలన పనులలో అధిక శ్రమ. మీ సామర్ధ్యాన్ని ఉపయోగించి పనులను పూర్తి చేయండి. వ్యాపారులకు లాభాలు. కావలసినంత ధనం చేతికందుతుంది కొంతభాగాన్ని దానధర్మాలు చేస్తారు. విద్యార్థులు మీ సమయాన్ని వృధా చేసే స్నేహితులను వదిలివేయండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.
కన్య రాశి: సహనము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం. కుటుంబ సభ్యులలో సామరస్య ధోరణి వలన ఆహ్లాదకర వాతావరణం. శుభవార్త అందుకుంటారు. విదేశీ వ్యాపారం చేసే వారికి లాభాలు. ఆఫీసులో అదనపు బాధ్యతల వలన పనులలో అధిక శ్రమ. మీ సామర్ధ్యాన్ని ఉపయోగించి పనులను పూర్తి చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు చిన్నచిన్న గొడవలను మర్చిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.
సింహ రాశి: ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. దైవప్రార్థన వలన మానసిక బలం. ఆఫీసు పనులను మీ సామర్థ్యాన్ని ఉపయోగించి సకాలంలో పూర్తి చేస్తారు. తోటి ఉద్యోగుల సహాయం లభిస్తుంది. వ్యాపారులకు మొదట్లో ఇబ్బందులు ఉన్నా తర్వాత లాభాలు అందుకుంటారు. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఈ రాశి స్త్రీల కి కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్యం వలన మానసిక అశాంతి.
ధనస్సు రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే సహనము సరైన ప్రణాళిక తప్పనిసరి. జనాలు మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నారు అది ఏంటో తెలుసుకోకుండా మాట ఇవ్వకండి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. పాత అప్పులు తీర్చి వేయవలసి వస్తుంది. అప్పులు చేయడం ఎంత తప్పు ఈరోజు అప్పు తీరుస్తున్నప్పుడు తెలుసుకుంటారు. ఆఫీసు పనులలో అధిక శ్రమ. అధిక సామర్థ్యంతో సరైన ప్రణాళికతో పనులు పూర్తి చేయటానికి ప్రయత్నించండి. కావలసినంత ధనం చేతికందుతుంది. విద్యార్థులు తమ భవిష్యత్తు చదువులపై సరైన ప్రణాళికలు వేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు చిన్న చిన్న గొడవలను మర్చిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు నడపండి.
వృశ్చిక రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే జాగ్రత్త, సహనం అవసరం. ఫిట్ నెస్ కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆఫీసు పనులలో అదనపు బాధ్యతల వలన అధిక శ్రమ. మీ పని నిబద్ధత పట్ల అందరి ప్రశంసలు. కొందరికి ప్రమోషన్. మీ కుటుంబ ఆదాయ వ్యవహారాల లోనికి ఇతరులను రానీయకండి. వివాదాస్పద విషయాల జోలికి వెళ్లి వాదోపవాదాలకు దిగకండి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ముఖ్యంగా మీ పిల్లలతో గడపటం మీకు ఎంతో ఎనర్జీ. ఆదాయం పర్వాలేదు దుబారా ఖర్చులు నివారించండి. అధిక శ్రమ వలన మోకాళ్ళ నొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు చిన్నచిన్న గొడవలను మర్చిపోయి మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు గడపండి.
తులారాశి: ఇంట్లో శుభకార్యాలు. ఆత్మవిశ్వాసము దైవ బలంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. మీ పిల్లల చదువులను గమనించండి లేకుంటే భవిష్యత్తులో బాధపడతారు. ఆఫీసులో మీ పని నిబద్ధత పట్ల అందరి ప్రశంసలు. కొత్తగా వ్యాపారం చేద్దామనుకుంటున్న వారు అనుభవజ్ఞుల సలహా తో ఆ పని చేయండి. కావాల్సినంత ధనం చేతికందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఇది ఒక ఆనందకరమైన రోజు.
మకర రాశి: ఆత్మ విశ్వాసం ఆత్మ స్థైర్యం సహనం ఇవన్నీ కావాలి మీరు అనుకున్న కార్యాలను సాధించాలంటే. దీర్ఘకాలంగా బాధిస్తున్న రోగం తగ్గుతుంది. ఆడంబరాల కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు గమనించండి. మీ మీద ఆజమాయిషి చలాఇద్దామనుకునే వారిని దూరం పెట్టండి. మంచివారు అనిపించుకోవాలనే మీ తాపత్రయం చాలా తప్పు. ఆఫీసులో తోటి ఉద్యోగుల సహాయం లభిస్తుంది. ఆఫీసు పనులలో అధిక శ్రమ ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి వ్యాపార విస్తరణ కోసం చేస్తున్న ప్రయాణాలు దీర్ఘకాలంలో లాభాలను తెస్తాయి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు చిన్న చిన్న గొడవలు మర్చిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.
కుంభరాశి: పట్టుదల ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. స్నేహితుల సహాయం లభిస్తుంది. ఆర్థిక సమస్యలను గురించి అతిగా ఆలోచించడం మానండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీ పై అధికారులు మిమ్మల్ని గమనిస్తున్నారు. వ్యాపారులు మీ భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆఫీసులో పనులను అధిక సామర్థ్యం తో సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి. ఆదాయం పరవాలేదు అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య లేదు ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు కుటుంబ సమస్యల గురించి బాధపడటం మాని పరిష్కారం గురించి ఆలోచించండి.
మీన రాశి: ఆత్మవిశ్వాసం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల గురించి కుటుంబ సభ్యులతో చర్చించండి. వారితో మనసు విప్పి మాట్లాడండి. అపార్ధాలు తొలగిపోతాయి అందరూ ఆనందిస్తారు. అనాలోచిత నిర్ణయాల వలన భవిష్యత్తులో ఇబ్బందులు. ఆఫీసులో పనులను సకాలంలో చకచకా పూర్తి చేస్తారు. కావలసినంత ధనం చేతికందుతుంది. అదృష్టం మీ పక్షాన ఉంది. ఫిట్నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు