- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బుధవారం పంచాంగం, రాశిఫలాలు (19-05-2021)
ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : సప్తమి
(నిన్న ఉదయం 12 గం॥ 30 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 12 గం॥ 45 ని॥ వరకు)
నక్షత్రం : ఆశ్లేష
(నిన్న మధ్యాహ్నం 2 గం॥ 52 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 3 గం॥ 43 ని॥ వరకు)
యోగము : ధ్రువము
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 7 ని॥ నుంచి 5 గం॥ 46 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు మధ్యాహ్నం 2 గం॥ 3 ని॥ నుంచి 3 గం॥ 42 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 46 ని॥ నుంచి 12 గం॥ 37 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 12 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 49 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 35 ని॥ నుంచి మధ్యాహ్నం12 గం॥ 12 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 20 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 57 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 43 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 42 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : కర్కాటకము
మేష రాశి : ఊహలలో విహరించకుండా వాస్తవానికి రండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థిక విషయాలు పుంజుకుంటాయి. మీకు అప్పు ఇచ్చిన వారు దానిని తిరిగి ఇవ్వకపోతే మీ మీద కేసు వేసే అవకాశం. జాగ్రత్త వహించండి. వ్యాపారంలో చేసిన మార్పుల వలన మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశి స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల ఉన్నటువంటి చికాకులు తొలగిపోతాయి.
వృషభ రాశి : మీ ప్రత్యేకమైన వ్యక్తిత్వం వల్ల ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులు కొత్త ఆలోచనలతో తమ వ్యాపారంను అభివృద్ధి చేసుకోండి. ఈ కరోనా సమయంలో మీ కుటుంబ సభ్యులలో ధైర్యాన్ని నింపండి. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.
మిధున రాశి : చేస్తున్న వృత్తి లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. మానసిక ప్రశాంతత కోసం యోగా మెడిటేషన్ ఉపయోగపడతాయి. అనుకోని కొత్త బాధ్యతల వల్ల ఉద్యోగంలో కొంత ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. ప్రశాంతచిత్తంతో పని చేస్తే అన్నీ సర్దుకుంటాయి. ఈ రాశి స్త్రీలకు మీ పై అధికారులు మీ శ్రమను సామర్థ్యాన్ని గుర్తిస్తారు.
కర్కాటక రాశి : వృత్తి ఉద్యోగాలలో ఊహించని లాభాలు ఉన్నాయి. విజయం సాధించిన ఇతరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోండి. కుటుంబంలోని వారి సలహాలను తీసుకోండి. మంచి భవిష్యత్తు ఏర్పడబోతోంది. కొత్త విషయాలలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి వినోద కార్యక్రమాలలో పాల్గొనండి. ఈ రాశి స్త్రీల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి.
సింహ రాశి : సొంతంగా ప్రారంభించిన పనులు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ సహోద్యోగుల సలహాలను పూర్తిగా నమ్మకండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యాపారంలో అనుకున్నంత అభివృద్ధి కనిపిస్తుంది. ఆలోచనలలో స్పష్టత వస్తుంది. ఈ రాశి స్త్రీలకు కీలక సమయంలో సోదరులు సహాయపడతారు.
తులా రాశి : నిజాయితీతో వ్యవహరించండి మీ వ్యవహారశైలి అందరికీ ఆమోదయోగ్యం అవుతుంది. ఈ కరోనా సమయములో మీ భవిష్యత్తు ప్రణాళికలను సరిగా వేసుకోండి. నెగటివ్ థాట్స్ ను వదిలి వేయండి. మీరు అదృష్టవంతులు మీకు దైవ బలం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు నూతన రంగాలలో ప్రవేశించడానికి అవకాశం.
కన్య రాశి : ఈ కరోనా సమయంలో ఆరోగ్యాన్ని గాలికి వదిలి వేయకండి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆప్తులను పరామర్శిస్తారు. ఉద్యోగంలో జాగరూకతతో వ్యవహరించండి. సకాలంలో పనులను పూర్తి చేయండి. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబ ఖర్చులు మీ అంచనాలను దాటినా అవి ఉపయోగమే అని తర్వాత కాలంలో తెలుస్తుంది. ఈ రాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
వృశ్చిక రాశి: ఈ కరోనా సమయంలో అనారోగ్య సమస్యలు లేకున్నా ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల ముఖ్య అవసరాలకు ప్రాధాన్యత నివ్వండి. ఉద్యోగంలో పని పట్ల మీరు చూపిస్తున్న అశ్రద్ధ వల్ల మీ పై అధికారుల నుండి మాట పడాల్సి రావచ్చు. ఒత్తిడికి లోనవు కండి. ఈ రాశి స్త్రీలకు విద్యా సంబంధ విషయాల్లో సంతాన పురోగతి బాగుంటుంది.
ధనస్సు రాశి : ఆశావహ దృక్పథం తో పని చేయండి. మీ ఆత్మవిశ్వాసం మీకు విజయం వైపు దారి చూపిస్తుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులను చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. భాగస్వామ్య వ్యాపారాలలో అనుకోని విధంగా భాగస్వాముల నుంచి వ్యతిరేకత రావచ్చు. జీవిత భాగస్వామితో ఆనందకరంగా గడిపే రోజు. వాహనాలు, గృహం కొనుగోలు చేసే వీలుంది. ఈ రాశి స్త్రీలకు మీరు చేసే ప్రతి పనికి దైవానుగ్రహం తోడవుతుంది.
మకర రాశి : ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడం వల్ల కొన్ని అప్పులు తీరి ఊరట చెందుతారు. తల్లిదండ్రులతో మీ భావాలు పంచుకోవడం వల్ల వారి సహాయం మీకు లభిస్తుంది. ఈ కరోనా సమయంలో వ్యాపారంలో తగినంత లాభం రావాలంటే అధిక శ్రమ పడవలసి ఉంది. పెండింగులో ఉన్న సకల వ్యవహారాలు పూర్తి అయి ఆనందం కలుగుతుంది. పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలుగుతుంది. ఈ రాశి స్త్రీలు కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.
కుంభరాశి : ఆర్థిక పరిస్థితులలో గందరగోళం తొలగుతుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందకరంగా గడుపుతారు. ఉద్యోగాలలో క్రమేపీ మరింత సానుకూల పరిస్థితులు ఉంటాయి. బుద్ధి బలం తో పని చేయండి ఆపదల నుంచి బయట పడతారు. ఈ కరోనా సమయంలో కూడా జీవనమార్గం సక్రమంగానే నడుస్తుంది. ఈ రాశి స్త్రీలకు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తారు.
మీన రాశి : ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కావలసిన మార్గాలు లభిస్తాయి. ఇతరుల మీద ఆధారపడవలసి రావటం వలన మనశ్శాంతి కరువవుతుంది. నెగిటివ్ థాట్స్ వదిలివేయండి మీ జీవితం ఎంతో విలువైనది అని గ్రహించండి. మీ జీవితాన్ని బంగారుమయం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది అని గ్రహిస్తారు. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. ఈ రాశి స్త్రీలు మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి అన్నివిధాలుగా ప్రయత్నిస్తారు.