బుధవారం పంచాంగం, రాశి ఫలాలు(12-05-2021)

by Hamsa |
బుధవారం పంచాంగం, రాశి ఫలాలు(12-05-2021)
X

సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పాడ్యమి
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 31 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 6 ని॥ వరకు)
నక్షత్రం : కృత్తిక
(నిన్న రాత్రి 11 గం॥ 33 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 40 ని॥ వరకు)
యోగము : శోభనము
కరణం : (కింస్తుఘ్న) కౌస్తుభ
వర్జ్యం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 54 ని॥ వరకు)
అమృతగడియలు : (ఈరోజు రాత్రి 11 గం॥ 57 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 1 గం॥ 45 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 37 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 48 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 11 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 21 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 57 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 45 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 39 ని॥ లకు
సూర్యరాశి : మేషము
చంద్రరాశి : మేషము

రాశి ఫలాలు..

మేష రాశి

వ్యాపార రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి జాగ్రత్త. విపరీతమైన మానసిక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రాశి స్త్రీలకు మెతక వైఖరి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది.

వృషభ రాశి

శత్రువర్గం మీద ఆధిపత్యం చెలాయించాలనే మీ కోరిక నెరవేరుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. వ్యవహారాలలో విజయం లభిస్తుంది. పట్టుదలతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మీరు అనుకోని విధంగా మీ పాతబాకీలు వసూలవుతాయి. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మిధున రాశి

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. శుభకార్యాలకు అవకాశం. వ్యాపారంలో వర్కర్స్ కి జీతాలు ఇవ్వలేక పోవటం వారిని తొలగించడం జరుగుతుంది. ఇతరుల మీద అజమాయిషీ చలఇద్దామని అనుకోవడం వల్ల మీకే నష్టం. కుటుంబ సభ్యులు స్నేహితుల వైఖరి మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రాశి స్త్రీలకు ముఖ్యమైన విషయాలను గోప్యంగా ఉంచండి లేనిచో తరువాత విచారిస్తారు.

కర్కాటక రాశి

పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. బయట తిండి మీకు మంచిది కాదు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. దైవ కార్యాలు చేపడతారు. దగ్గరి వారి వల్ల మేలు జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలకు అధికంగా ప్రాముఖ్యతనిస్తారు. అంతరంగిక విషయాలు బయటకు తెలపకండి.

సింహ రాశి

ఇంటిలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. రాజకీయవర్గాలకు అనుకూల సమయము. నూతన ప్రయత్నాలు సఫలమౌతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేయండి. మీ మొండి వైఖరి కుటుంబంలో అశాంతికి దారితీయవచ్చు. విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించండి. మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశి స్త్రీలకు బ్యూటీ పార్లర్ లకు సంబంధించిన వ్యాపారాలు లాభిస్తాయి.

కన్య రాశి

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్త వహించండి. దూరపు బంధువుల నుండి మంచి వార్తలు రావచ్చు. ఈ రాశి స్త్రీలకు విదేశీయాన సంబంధ అంశాలు అనుకూలంగా ఉన్నాయి.

తుల రాశి

ఉద్యోగంలో శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలం ఉంటుంది. చెడు ఆలోచనలను దూరం చేసుకోండి. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారంలో భాగస్వాముల మోసం తెలిసి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. మనశ్శాంతి కోసం దేవాలయాలను సందర్శిస్తారు. ఈ రాశి స్త్రీలు బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.

మకర రాశి

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది విజయము త్వరగా లభిస్తుంది. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పల్లి తల్లిదండ్రులతో పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరమైన సమస్యలు బాధించవచ్చు. ఈ రాశి స్త్రీలకు నేను ఒంటరిని నాకు ఎవరూ లేరు అన్న భావన కుంగదీస్తుంది.

వృశ్చిక రాశి

ప్రతి చిన్న విషయానికి ఇబ్బందులు ఎదురైనా చివరకు విజయ ఫలితాలు వస్తాయి. గతంలో బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను చాలావరకు తీసివేస్తారు. చుట్టాలతో ఆనందంగా గడిపే అవకాశం. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఇతరులపై ఆధారపడి వద్దు. ఈ రాశి స్త్రీలకు సహా ఉద్యోగుల చిల్లర వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి.

ధనుస్సు రాశి

ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే మీ భావాలు ఇతరులను బాధించవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. వ్యాపారంలో అంచనాలకు తగిన లాభాలు దొరుకుతాయి. సున్నితమైన అంశాలలో తొందరపాటు నిర్ణయం వద్దు. అందరితో సంప్రదించండి. ఈ రాశి స్త్రీలకు ఇచ్చిన డబ్బులు తిరిగి రావు జాగ్రత్త వహించండి.

కుంభ రాశి

ఈ రోజు అత్యంత ఉత్సాహంతో ఏ పనినైనా చిటికెలో సాధిస్తారు ఉద్యోగంలో ఉత్తమ ఫలితం లభిస్తుంది. వాహన లాభం ఉంది. విద్యార్థులకు శ్రమ పడితే గానీ ఫలితం కనపడదు. విదేశాలలో నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వాయిదాల పద్ధతిలో స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి పేరు మీద నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. ఈ రాశి స్త్రీలకు కయ్యానికి కాలు దువ్వుతున్నారని మీ మీద ఆరోపణలు వస్తాయి.

మీన రాశి

అందరితో సంతోషంగా ఉండండి సంతోషమే సగం బలం. ఇంతకు ముందు ఇచ్చిన బాకీలు వసూలవుతాయి. మీరు నమ్మిన ధర్మాన్ని ఆచరించండి మొహమాటానికి పోవొద్దు. ఉద్యోగంలో ఒత్తిళ్లు తగ్గుతాయి. దేవుడి గుడిని సందర్శిస్తారు. సలహాలు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించండి లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఈ రాశి స్త్రీలకు మీ పిల్లలపై ఇతరుల పెత్తనం మీకు నచ్చదు.

Advertisement

Next Story