- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ జనాభాలో మీ నంబర్ ఎంతో తెలుసా?
దిశ, ఫీచర్స్ : సువిశాలమైన భూగ్రహంపై దాదాపు ఏడు బిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. రోజురోజుకీ ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే చాలా మందికి తాము పుట్టినప్పుడు ప్రపంచ జనాభా ఎంతో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండే ఉంటుంది. అలాంటివారి కోసం WorldPopulationHistory.org వెబ్‌సైట్ ఖచ్చితమైన వివరాలను అందిస్తోంది. కేవలం పుట్టిన తేదీని ఎంటర్ చేస్తే చాలు.. సెకన్లలో ఒక చార్ట్‌ను ప్రిపేర్ చేస్తుంది. మీరు పుట్టిన సమయంలో జనాభా లెక్కలతో పాటు ఆ తేదీ నుంచి నేటి వరకు మానవ జనాభా పెరుగుదల క్రమాన్ని చూపెడుతూ స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది.
‘నేను పుట్టిన1994 సంవత్సరాన్ని పరీక్షించినప్పుడు, ఆ సమయంలో ఈ గ్రహం మీద సజీవంగా ఉన్న మానవులలో దాదాపు 5,695,989,071వ స్థానంలో ఉన్నాను. ఈ అంచనాకు మద్దతు ఇవ్వడానికి సైట్ కొన్ని మూలాధారాలను యాడ్ చేసింది. దీని గురించి ఆలోచించడం ఇంకా మనోహరంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి’ అని ఓ యూజర్ వ్యాఖ్యనించాడు.
ప్రపంచ జనాభా పెరుగుదల
20వ శతాబ్దపు తొలినాళ్లలో ప్రపంచ జనాభా గరిష్టంగా 1,650 మిలియన్‌గా ఉంది. ఐదు దశాబ్దాల్లో (1950 నాటికి) ఆ సంఖ్య 2,536 మిలియన్‌కు చేరుకుంది. ఇక 1901 సంవత్సరంలో జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా దాదాపు 23 కోట్లు. ప్రధానంగా వైద్య రంగంలో పురోగతి లేకపోవడంతో పాటు రాజకీయ గందరగోళం కారణంగా ఆ కాలంలో వ్యక్తుల ఆయుర్దాయం తగ్గించబడింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సైన్స్ అభివృద్ధికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో నయంకాని అనేక వ్యాధులకు వైద్యం, చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఇదే క్రమంలో మానవాళి అంతరిక్షంలోకి ప్రయాణించగలిగే పురోగతి సాధించింది.
ఇక స్వాతంత్య్రానంతరం 1951 నాటికి 36 కోట్లతో జనాభాతో భారతదేశం కూడా గణనీయమైన వృద్ధిని సాధించింది. యాభై ఏళ్ల తర్వాత(2001 నాటికి) ఆ సంఖ్య 1 బిలియన్ క్రాస్ చేసి ప్రస్తుతం 1.32 బిలియన్‌కు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్లకు పైగా జనాభాతో (2011లోనే 7 బిలియన్ అధిగమించాం) బలంగా ఉన్నాం. అయితే జనాభా సంఖ్య పెరుగుతూనే ఉంటుందా లేదా 7 – 8 బిలియన్ల మార్క్ వద్ద స్తబ్దత చూస్తామా? అనేది ఆసక్తికరంగా మారింది.