ఒకేసారి మూడు తుఫాన్లు.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన

by Mahesh |   ( Updated:2024-10-07 16:06:37.0  )
ఒకేసారి మూడు తుఫాన్లు.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన
X

దిశ, వెబ్ డెస్క్: నెల క్రితం కురిసిన భారీ వర్షాలకు, తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఒక్కసారిగా వచ్చిన వరదల కారణంగా ఏర్పడిన నష్టం నుంచి ప్రజలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడు కొలుకుంటున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిడుగులాంటి వార్తను చెప్పింది. ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు, మొత్తం మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మూడు తుఫాన్లతో ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ చెప్పుకొచ్చింది. కాగా ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కారణంగా.. మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed