AP Rain Alert:బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

by Jakkula Mamatha |   ( Updated:2024-10-06 13:05:06.0  )
AP Rain Alert:బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత నెలలో వర్షాలు దంచికొట్టాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు(Heavy Rains) లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. ఇక విజయవాడ(Vijayawada) నగరాన్ని వరదలు(Heavy Floods) ముంచెత్తాయి. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొంత వరకు వర్షాలు తగ్గుముఖం పట్టాయి అనుకున్న సమయంలో మళ్లీ బంగాళాఖాతంలో రెండు అల్పపీడన ద్రోణులు ఏర్పడుతున్నాయని.. దీంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు(Rains) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు(ఆదివారం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ క్రమంలో రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రాలకు సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 7, 8 తేదీల్లో తుఫాను వచ్చే ఛాన్స్ ఉందని కూడా అంచనా వేసింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Advertisement

Next Story