IMD: తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు..! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

by Ramesh Goud |
IMD: తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు..! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు ఈదుడు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వీస్తున్నట్టు తెలిపింది. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బుధవారం ఉమ్మడి మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మంతో పాటు కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే గురువారం ఉమ్మడి మెదక్‌, మహబూబ్‌నగర్‌తో పాటు వికారాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొన్నది.

Next Story

Most Viewed