Breakfast: ఉదయం పూట పొరపాటున కూడా ఈ టిఫిన్స్ తినకండి..!

by Prasanna |
Breakfast: ఉదయం పూట  పొరపాటున కూడా ఈ టిఫిన్స్ తినకండి..!
X

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది ఉదయాన్నే టిఫిన్ తింటుంటారు. అయితే, ఏది తినాలి? ఏది తినకూడదో తెలియక కొంత మంది తప్పులు చేస్తుంటారు. కొన్ని ఆహారాలు తినడం వలన బరువు సులభంగా పెరుగుతారు. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, కొన్ని ఆహారాలు తినకూడదని నిపుణులు చెబుతుంటారు. ఆ ఆహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

మసాలా ఆహారం ఉదయం పూట అసలు తీసుకోకూడదు. ఖాళీ కడుపుతో కారం ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. స్పైసీ ఫుడ్ జీర్ణవ్యవస్థలో సమస్యలను కలిగిస్తుంది.

పుల్లని పండ్లు- టిఫిన్ తీసుకోని వారు పుల్లటి పండ్లను తింటుంటారు. ఇది, కడుపులోని సున్నితమైన పొరను దెబ్బతీస్తుంది. అలాగే కడుపు నొప్పి, గ్యాస్, అల్సర్ వంటి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, పుల్లటి పండ్లను తీసుకోకపోవడమే మంచిది. ఉదయం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి.

అరటిపండు- ఖాళీ కడుపుతో అరటిపండ్లు తీసుకోవడం వలన శరీరంలో మెగ్నీషియం స్థాయిలు పెరుగుతాయి. ఇది కాల్షియం, మెగ్నీషియం సమతుల్యతను దెబ్బతినేలా చేస్తుంది. ఇది బోన్స్, గుండెపైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి , అరటిపండును అల్పాహారం తర్వాత మాత్రమే తీసుకోవాలి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed