Thaman: ఆ సినిమా ఆఫర్ రాగానే భయంతో వణికిపోయా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షాకింగ్ కామెంట్స్

by Kavitha |
Thaman: ఆ సినిమా ఆఫర్ రాగానే భయంతో వణికిపోయా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అంజలి, సునీల్, సముద్ర ఖని, ఎస్ జె సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ టీమ్ ప్రమోషన్ల జోరులో ఉన్నారు. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా గేమ్ ఛేంజర్ గ్లోబల్ ఈవెంట్‌లో పాల్గొన్న తమన్ మాట్లాడుతూ.. "పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాకి సంగీతం అందిస్తున్న టైంలో మగువా మగువా పాటను దిల్ రాజుకు వినిపించాను.

పాట బాగుంది అని చెప్పిన తర్వాత దిల్ రాజు నవ్వుతూనే ఉన్నారు. ఆ తర్వాత కాసేపటికి నువ్వు చెన్నై వెళ్లి డైరెక్టర్ శంకర్ గారిని కలవాలి అని చెప్పారు. ఈ మాటలు విన్న నాకు ఫస్ట్ భయం వేసింది. కానీ, ఆ తర్వాత ఫ్లైట్ గాల్లో తేలకముందే నేను గాల్లో తేలిపోయాను. నాకు యాక్టింగ్ రాదు అని తెలిసినా కూడా శంకర్ గారు నన్ను ‘బాయ్స్’ సినిమాలో పెట్టారు. నేను బాగా నటించకపోతే నన్ను మైక్‌లో తిడుతూ ఉండేవాళ్ళు. అలానే నేను ఆయన పక్కన కూర్చుని ఉన్నప్పుడు సిద్ధార్థ పైన ఏదో ఒక సెటైర్ వెయ్ అంటూ చెబుతూ వచ్చేవాళ్ళు. నేను వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్‌లాగా పెరిగాను నన్ను కూడా ఆయన అలానే ట్రీట్ చేశారు. ఆయనతో ఈరోజు కలిసి పని చేయడం చాలా హ్యాపీగా ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు తమన్.

Advertisement

Next Story

Most Viewed