బంగాళాఖాతంలో అల్పపీడనం

by Shyam |
బంగాళాఖాతంలో అల్పపీడనం
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణశాఖ బుధవారం వెల్లడించింది. మే15 నాటికి వాయుగుండంగా మారి బలపడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. మరుసటి రోజు తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని, వాయువ్య బంగాళాఖాతం వైపు పయనిస్తుందని వివరించింది. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలు, తమిళనాడు తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Advertisement

Next Story