తెలంగాణకు వర్ష సూచన.. ఆ జిల్లాలకు అలర్ట్

by Shyam |   ( Updated:2021-03-24 05:58:14.0  )
తెలంగాణకు వర్ష సూచన.. ఆ జిల్లాలకు అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా భానుడు ప్రతాపానికి వేడెక్కిన రాష్ట్రాలు ప్రస్తుతం చల్లబడ్డాయి. తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచనా ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మంగళవారం విదర్భ మరియు దానిని ఆనుకొని ఉన్న దక్షిణ చత్తీస్గఢ్ ప్రాంతాలలో 1.5 కి.మీ ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం బుధవారం ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5 కి.మీ. నుండి 2.1 కి.మీ. మధ్య కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

క్రింది స్థాయి తూర్పు గాలులలో అంతర్గత తమిళనాడు నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి బలహీన పడిన కారణంగా తెలంగాంలో పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్ మరియు వికారాబాద్ అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షంతో పాటు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

Next Story