‘టీనేజర్లకూ టీకా వేస్తాం’

by vinod kumar |
‘టీనేజర్లకూ టీకా వేస్తాం’
X

వాషింగ్టన్: ప్రపంచదేశాలు ఇప్పటి వరకు కరోనా బారినపడే ముప్పు అధికంగా ఉన్నవారికే అందులోనూ వయోధికులకే ప్రాధాన్యతనిస్తూ టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. క్రమంగా ఇతరులరూ విస్తరించే వ్యూహం ఇందులో ఉన్నది. కానీ, ఇప్పుడు రిస్క్ కేటగిరీ అయిన టీనేజర్లకు టీకా వేసే ఆలోచనలు ఏ దేశమూ చేయలేదు, ఒక్క అమెరికా తప్పా. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ దేశంలోలో రిస్క్ టినేజర్లకూ టీకా వేసే యోచన చేస్తున్నట్టు వెల్లడించారు. తాము సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారని, కరోనా మహమ్మారికి ముందటి సాధారణ పరిస్థితులను పునరుద్ధరించే పటిష్ట నిర్ణయాలను అమలు చేయనున్నారని వివరించారు. జులై 4 నాటికి అమెరికాలో 70శాతం వయోజనులు కనీసం ఒక్క డోసు టీకానైనా వేసుకునే టార్గెట్‌ను నిర్దేశించుకున్నామని తెలిపారు.

అలాగే, 16 కోట్ల అమెరికా పౌరులకు రెండు డోసులనూ పూర్తి చేయాలని లక్షించామని అన్నారు. వీరి తర్వాత కౌమారదశలోని వారికీ టీకా వేయాలనే నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 56శాతం వయోజనులు కనీసం ఒక్క డోసు టీకానైనా తీసుకుని ఉన్నారు. తమ టీకాను 2260 మంది 12 నుంచి 15ఏళ్ల పిల్లలపై ట్రయల్స్ నిర్వహించామని, వారిపైనా తమ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు తేలిందని ఫైజర్, దాని భాగస్వామి బయోఎన్‌టెక్‌లు మార్చిలో వెల్లడించిన సంగతి తెలిసిందే. త్వరలోనే టీనేజర్లకు టీకా పంపిణీకి రెగ్యులేటర్ నుంచి అత్యవసర అనుమతులు వచ్చే అవకాశమున్నది. తాము ఆ ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నామని, ఆ అనౌన్స్‌మెంట్ రాగానే టీనేజర్లకు టీకా వేయడానికి సిద్ధంగా ఉన్నామని బైడెన్ వైట్‌హౌజ్ రిపోర్టర్లకు తెలిపారు.

నిపుణుల ఆందోళనలు

భారత్ సహా చాలా దేశాలు టీకా కొరతతో బాధపడుతున్నాయి. ఇంకా టీకా నిల్వలు లేక, కొనగోలు సామర్థ్యం లేక తమ పౌరులకు వ్యాక్సిన్‌లు అందించలేకపోతున్నాయి. అందులోనూ హై రిస్క్ ఉన్న కేటగిరీలకు అందించడంలో వెనుకబడ్డాయి. ఈ సందర్భంలో అమెరికాలో రిస్క్ టీనేజర్లకు టీకా వేయడంపై నిపుణులు అభ్యంతరం తెలుపుతున్నారు. మహమ్మారిని పారదోలాలంటే అందరికీ టీకా వేయడం ఉత్తమమైన మార్గమే కానీ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హై రిస్క్ ఉండి టీకా తక్షణమే పొందాల్సిన వాళ్లు కోట్లల్లో ఉన్నారని, వారిని వదిలిలో రిస్క్ వారికి ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో ఇప్పటి వరకు కరోనాతో 5.74 లక్షల మంది మరణించారు. ఇందులో 18 ఏళ్లలోపు వారు 300లోపే ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed