‘ప్రభుత్వ బ్రాండ్‌తో నాణ్యమైన మాంసం విక్రయాలు’

by Shyam |
‘ప్రభుత్వ బ్రాండ్‌తో నాణ్యమైన మాంసం విక్రయాలు’
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: త్వరలో తెలంగాణ ప్రభుత్వ బ్రాండ్‌తో నాణ్యమైన మాంసం విక్రయాలు ప్రారంభిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక , మత్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, వైద్యుల ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో నీలి, శ్వేత, పింక్ విప్లవాలతో పశుసంవర్ధక శాఖ దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు.

సీఎం కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్రంలో అపారమైన సంపదను సృష్టించామన్నారు. జీవాలకు వైద్యసేవలు అందించేందుకు సంచార పశువైద్యశాలలను ప్రారంభించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న దేశంలోనే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం అనేక సందర్బాలలో తెలంగాణ పశుసంవర్ధక శాఖను ప్రశంసించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed