అలా చేస్తే ఊరుకోం..

by Shyam |
అలా చేస్తే ఊరుకోం..
X

దిశ, దుబ్బాక: ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఊరుకోబోమని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. దుబ్బాకలోని దుంపపల్లిలో మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కాగా గ్రామంలో నాణ్యతలేని డ్రైనేజీలు, రోడ్లను నిర్మించారనీ వాటి పరిస్థితిని జితేందర్ రెడ్డి దృష్టికి గ్రామ యువకులు తీసుకు వచ్చారు. దీంతో ఆ స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. డ్రైనేజీలు,సీసీ రోడ్లను నాణ్యంగా నిర్మించాలని అన్నారు. ఉప ఎన్నికలను పరిగణలోకి తీసుకుని డ్రైనేజీ, సీసీ రోడ్లను ప్రభుత్వం తొందర తొందరగా నిర్మిస్తున్నదని అన్నారు.

Advertisement

Next Story