పోరాడి గెలుస్తాం..పంజాబ్, హర్యానాల్లో రైతుల నినాదాలు

by Shamantha N |   ( Updated:2021-05-26 12:04:49.0  )
పోరాడి గెలుస్తాం..పంజాబ్, హర్యానాల్లో రైతుల నినాదాలు
X

న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన మూడు నూతన సాగు చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలకు ఆరు నెలలు నిండిన సందర్భంగా రైతన్నలు బుధవారం దేశవ్యాప్తంగా బ్లాక్ డే పాటించారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ, ఘాజిపూర్‌లలో రైతులు ప్రభుత్వ నేతల దిష్టి బొమ్మలు దహనం చేశారు. తాము పోరాడతామని, తాము గెలిచి తీరుతామని నినాదాలు చేశారు. తాము కరోనాను వ్యాప్తి చేయడం లేదని, రోగనిరోధక శక్తిని అందించే పంట పండిస్తున్నామని తెలిపారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో చాలా చోట్ల ఇండ్లపై నలుపు జెండాను ఎగరేశారని, రైతులూ నలుపు జెండాలను పట్టుకుని ర్యాలీలు తీశారు. ఘాజిపూర్‌లో రాకేశ్ తికాయత్ నలుపు రంగు టర్బన్ కట్టుకుని నిరసన చేశారు. దిష్టిబొమ్మ దహనం చేయబోతుంటే పోలీసులు అడ్డుకోవడంతో చిన్నపాటి ఘర్షణ జరిగింది.

Advertisement

Next Story

Most Viewed