హైదరాబాద్ పేరు మారుస్తాం.. ఎవరన్నారంటే..

by Shyam |   ( Updated:2020-11-08 08:18:40.0  )
హైదరాబాద్ పేరు మారుస్తాం.. ఎవరన్నారంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ఇదేక్రమంలో మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేశారు. కేటీఆర్‌కు కేంద్రం ఇచ్చిన నిధుల కంటే బాలీవుడ్‌పైనే ఎక్కువ అవగాహన ఉందని, కేటీఆర్‌కు బాలీవుడ్‌తో గొడవ జరిగినట్లు సోషల్ మీడియాలో చదివినట్లు పేర్కొన్నారు. సీఎం కుమారుడు కాకుంటే కేటీఆర్‌ను పట్టించుకునేదెవరని అన్నారు. కేటీఆర్‌కు గ్రేటర్ ఎన్నికల భయం పట్టుకుందన్నారు. విపత్తు సాయం కింద కేంద్రం ఇచ్చిన రూ.224కోట్లు కేటీఆర్‌కు కనిపించడం లేదా అని విమర్శించిన ఎంపీ అరవింద్.. వరద బాధితుల సాయం కేటీఆర్ కుటుంబం ఇస్తోందా అని ప్రశ్నించారు. ప్రధాని కంటే ఎక్కువ జీతం తీసుకుంటోన్న కేసీఆర్ పనిలో సోమరి పోతు తీవ్రంగా విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed