ఇండియాలో వియ్‌ ట్రాన్స్‌ఫర్ బ్యాన్!

by Harish |
ఇండియాలో వియ్‌ ట్రాన్స్‌ఫర్ బ్యాన్!
X

ప్రముఖ ఫైల్ షేరింగ్ వెబ్‌సైట్ వియ్‌ట్రాన్స్‌ఫర్.కామ్‌ మీద టెలికమ్యుూనికేషన్ డిపార్ట్‌మెంట్ నిషేధం విధించింది. పబ్లిక్ ఇంట్రెస్ట్, జాతీయ భద్రతను కారణాలుగా చూపించి ఈ నిషేధం విధించింది. ఈ సైట్ ద్వారా 2 జీబీ వరకు ఉచితంగా ఫైళ్లను పంపించుకోవచ్చు. అదే ప్రీమియంలో అయితే అంతకంటే పెద్ద ఫైళ్లను కూడా పంపించుకోవచ్చు.

మే 18వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు రెండు ప్రత్యేక అడ్రస్‌ల మీద నిషేధం విధించాలని టెలికాం శాఖ ఆదేశాలు పంపింది. తర్వాత మరో నోటీసు ద్వారా వియ్‌ట్రాన్స్‌ఫర్ వెబ్‌సైట్‌ను పూర్తిగా నిషేధించాలని ఆదేశించింది. ఈ వెబ్‌సైట్ కేవలం ఒక మెసెంజర్ సేవలు మాత్రమే అందిస్తుంది. ఇందులో అప్‌లోడ్ చేసిన ఫైళ్లను సైట్ చూడలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని పోర్న్ వీడియోలు ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయని టెలికాం శాఖ నెపంగా చూపించింది. కొవిడ్ లాక్‌డౌన్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఎంతో మందికి ఈ వియ్‌ట్రాన్స్‌ఫర్ వెబ్‌సైట్ చాలా ఉపయోగపడింది. అయితే ఇలాంటి కారణం చెప్పి సైట్‌ను బ్యాన్ చేయడం సబబు కాదని టెకీలు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ వీపీఎన్ ద్వారా వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేసుకునే సదుపాయం ఉండటంతో పెద్దగా ఇబ్బంది కలగడం లేదు.

Advertisement

Next Story

Most Viewed