రిజిస్ట్రేషన్లు ఆపాలని మేము ఆదేశించలేదు: హైకోర్టు

by Shyam |
రిజిస్ట్రేషన్లు ఆపాలని మేము ఆదేశించలేదు: హైకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హై కోర్టు క్లారిటీ ఇచ్చింది. ధరణి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆపాలని తాము ఆదేశించలేదని హై కోర్టు తెలిపింది. పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించు కోవచ్చని హై కోర్టు సూచించింది. ధరణిలో వ్వవసాయేతర ఆస్తుల నమోదుపై ఈనెల 10 వరకు కోర్టు స్టే పొడిగించింది.

నిబంధనలకు సంబంధించి 3 జీవోలపై న్యాయవాది గోపాల్ శర్మ మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ధరణి జీవోలపై కౌంటర్లు దాఖలు చేయాలని హై కోర్టు ఆదేశించింది. వ్వవసాయేతర ఆస్తుల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తి వేయాలని ఏజీ కోరారు. కాగా సేకరించిన డేటాకు భద్రత ఉండాల్సిందేనని హై కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈనెల 10కు హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed