లాక్‌డౌన్ మే 31తో ముగుస్తుందని చెప్పలేం..

by vinod kumar |   ( Updated:2020-05-24 05:16:40.0  )
లాక్‌డౌన్ మే 31తో ముగుస్తుందని చెప్పలేం..
X

ముంబయి : దేశంలో కరోనాతో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్ర ప్రభుత్వం మే 31వ తేదీ తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. దేశీయ విమాన సేవల పునరుద్ధరణపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ ఈ విషయాన్ని సూత్రప్రాయంగా వెల్లడించారు. మే 31వ తేదీతో లాక్‌డౌన్ ముగుస్తుందని చెప్పలేమని, అటు తర్వాత ఎటువంటి ప్రణాళికను అనుసరించాలనే దానిపై సమాలోచనలు చేయాల్సి ఉందన్నారు. రానున్నరోజుల్లో మరింత క్లిష్టంగా ఉండబోతున్నాయని, వైరస్ వ్యాప్తి వేగం పుంజుకున్నదని చెప్పారు.ఈ రోజు ఉదయం కేంద్ర పౌర విమానాయాన మంత్రి హర్దీప్ సింగ్ పురితో తాను మాట్లాడానని చెప్పిన ఆయన..విమాన సేవల పునరుద్ధరణకు మరింత సమయం ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలిపారు.

Advertisement

Next Story