ప్రమాదాన్ని వాసన చూడొచ్చు.. కొత్త అధ్యయనంలో వెల్లడి

by Shyam |   ( Updated:2021-10-18 04:52:02.0  )
Images111
X

దిశ, ఫీచర్స్: ఏదైనా వాసనను ప్రమాదానికి సూచికగా కేంద్ర నాడీ వ్యవస్థ నిర్ధారించినప్పుడు మెదడులో ఏం జరుగుతుందో తెలిపేందుకు.. స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ పరిశోధకులు అధ్యయనం చేశారు. అసహ్యకరమైన లేదా అసౌకర్యాన్ని కలిగించే ప్రతికూల వాసనలు, పాజిటివ్ వాసనల కంటే ముందుగానే ప్రాసెస్ చేయబడతాయని, దానినుంచి తప్పించుకునేలా శరీరంలో ప్రతిస్పందనను కలిగిస్తాయని ఈ అధ్యయనం సూచించింది. ఈ అధ్యయన ఫలితాలు ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ పత్రికలో ప్రచురించబడ్డాయి.

ప్రమాదంతో సంబంధం ఉన్న అసహ్యకరమైన వాసనలను అవాయిడ్ చేసే ప్రతిస్పందన అనేది చాలాకాలంగా తెలిసిన ప్రక్రియగానే చూడబడింది. అయితే అది అపస్మారక, అత్యంత వేగవంతమైనదని మొదటిసారి తమ అధ్యయనం చూపిందని కరోలింక్సా ఇన్‌స్టిట్యూట్, క్లినికల్ న్యూరోసైన్స్ డిపార్ట్‌మెంట్ పరిశోధకుడు బెహజాద్ ఐరవాణి అన్నారు. మానవ మెదడులో ఐదు శాతం ఆక్రమించే ఘ్రాణ అవయవం.. మిలియన్ సంఖ్యలో విభిన్న వాసనల మధ్య తేడాను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. ఈ వాసనల్లో ఎక్కువ భాగం(రసాయనాలు, కుళ్లిన ఆహారం వంటివి) మన ఆరోగ్యం, మనుగడకు ముప్పును కలిగించేవాటితో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ముక్కు ద్వారా పీల్చిన తర్వాత 100 -150 మిల్లీ సెకన్లలోపు వాసన సంకేతాలు మెదడుకు చేరతాయి. జీవుల మనుగడ అనేది ప్రమాదాన్ని నివారించి, వాటిని తప్పించుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. మానవుల్లో హానికరమైన ఉద్దీపనలను గుర్తించి ప్రతిస్పందించడానికి ఘ్రాణ భావం చాలా ముఖ్యమని స్పష్టమవుతోంది.

ధూమపానం చేయని వ్యక్తులను రెండు సమూహాలుగా విభజించి, పరిశీలించి ఈ అధ్యయనం చేపట్టారు. మొదటి గ్రూప్‌లో19 మంది వ్యక్తులు లినలూల్ పర్‌ఫ్యూమ్ లేదా ఫ్రూట్-స్మెల్లింగ్ ఈథైల్ బ్యూటిరేట్ వాసన గురించి అడిగారు. ఈ క్రమంలో గార్లిక్ స్మెల్ గల డైఇథైల్ డైసల్ఫైడ్ వాసన కూడా చూపించారు. ఈ మేరకు సదరు వ్యక్తుల్లో రెండు రకాల మెదడు తరంగాలు గమనించబడ్డాయి. ఒకటి గామా తరంగాలు. ఇవి అటెన్షన్, జ్ఞాపకశక్తి కోసం ఆధారపడే వేగవంతమైన ప్రాసెసింగ్ తరంగాలు. ఇక మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఉత్పన్నమయ్యేవి బీటా తరంగాలు. రెండో బృందంలో 21 మంది వాలంటీర్ల కోసం అత్యంత ఆహ్లాదకరమైన వాసనలను చూపించి వారి ఫిజికల్ రియాక్షన్స్‌ను రికార్డ్ చేశారు. కాగా ఏదైనా ప్రతిస్పందనను సమన్వయపరిచేందుకు గామా, బీటా తరంగాలు కలిసి పనిచేస్తాయని కనుగొనబడింది.

Advertisement

Next Story