సూర్యాపేటకు నీటికొరతను నివారించాలి : ధర్మ అర్జున్

by Shyam |
సూర్యాపేటకు నీటికొరతను నివారించాలి : ధర్మ అర్జున్
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేటలో ఎదుర్కొంటున్న నీటి సమస్య పరిష్కారానికి దోసపాడు గాండ్ల చెరువు నుండి కృష్ణా జలాలను అందించాలని తెలంగాణ జనసమితి నియోజకవర్గ ఇంచార్జ్ ధర్మ అర్జున్ కోరారు. సూర్యాపేట పట్టణంలో ఇటీవల ఎదురవుతున్న నీటి కొరతను పరిష్కరించాలని కోరుతూ సూర్యాపేట మున్సిపల్ చైర్మన్, కమిషనర్‌లకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేటలో పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా నీరు అందించాలని ఆయన కోరారు.

కృష్ణ నది నుండి అవంతిపురంకు అందిస్తున్నారని, కానీ అవంతిపురం ప్రాజెక్టు నుండి పైపు లైన్ సరఫరాలో వరుసగా తలెత్తుతున్న సాంకేతిక సమస్యల మూలంగా పట్టణంలో నీటి సరఫరా సరిగా లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కేవలం వాట్సప్ లో ఒక మెసేజ్, ఒక పత్రికా ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. అవంతిపురం ప్రాజెక్టు నీటి నుండి నీటి సరఫరాలో తలెత్తుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తూనే, గతంలో మాదిరిగా గాండ్ల చెరువు నుండి కృష్ణ జలాలను పట్టణ ప్రజలకు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు మాంధ్ర మల్లయ్య, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బంధన్ నాయక్, ప్రకాష్, సతీష్, స్వామిగౌడ్, హరీష్, ఈశ్వర్ అరిఫ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed