హైదరాబాద్ ప్రజలకు గమనిక

by Anukaran |   ( Updated:2021-03-07 02:36:53.0  )
హైదరాబాద్ ప్రజలకు గమనిక
X

దిశ వెబ్‌డెస్క్: అసలే హైదరాబాద్‌లో వాటర్ సమస్యలు.. వాటర్ ఎప్పుడోస్తాయో తెలియని పరిస్థితి. వాటర్ వచ్చినప్పుడు బకెట్లలో, క్యాన్స్‌లో నింపుకుని పెట్టుకునే పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. ఇక ఇప్పుడు అసలే ఎండాకాలం. నీటి కొరత మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ ప్రజలకు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవేజ్ బోర్డ్ అధికారులు కీలక ప్రకటన చేశారు.

మార్చి 8న హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా సరిగ్గా ఉండదని వెల్లడించారు. నల్గొండ జిల్లాలోని కొండాపూర్, నర్సర్లపల్లి, గోడకొండ సబ్ స్టేషన్ల దగ్గర తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌కో ప్రతిపాదిత పవర్ షట్ డౌన్ అయిందని, అక్కడ మరమ్మతులు చేస్తున్న కారణంగా మార్చి 8న హైదరాబాద్‌లో నీటి సరఫరా సమస్య ఏర్పడిందని తెలిపారు.

అందుకనే మార్చి 8న నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు అధికారులు సూచించారు. నాచారం, బోడుప్పల్, తార్నాక, లాలా పేట్, మారెడ్ పల్లి, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, అసిఫ్ నగర్, మాదాపూర్, షేక్ పేట, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, అస్మాన్ గడ్, నారాయణగూడ లాంటి ప్రాంతాల్లో నీటి కొరత సమస్య ఉంటుందని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed