- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్ ప్రజలకు గమనిక.. రెండు రోజులు ఇబ్బందే

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్ 1, 2 తేదీల్లో నీటి సరఫరా నిలిపివేయనున్నట్టు వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-1 మెయిన్ పైప్‌లైన్ జంక్షన్ పనులతో పాటు చంద్రాయణ గుట్ట నుంచి కందికల్ గేట్ క్రాస్‌రోడ్ వరకు పైపులైన్ విస్తరణ పనులు ఈ రెండు రోజులు కొనసాగనున్నాయి. ఈ పనుల కోసం ఏప్రిల్ ఒకటిన (గురువారం) ఉదయం 6 గంటల నుంచి రెండో తేదీ (శుక్రవారం) ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండదు.
ఓ అండ్ ఎం డివిజన్ నెం.1 పరిధిలోని మిరాలం రిజర్వాయర్, కిషన్ బాగ్, ఓ అండ్ ఎమ్ డివిజన్ నెం- 2 పరిధిలోని అల్జుబైల్ కాలని, అలియాబాద్ రిజర్వాయర్ ప్రాంతం, బాలాపూర్ రిజర్వాయర్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు గమనించి సహకరించగలరని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు.