- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం ఇంటి ముట్టడి.. స్కూల్ టీచర్లపై వాటర్ కెనాన్ల ప్రయోగం
చండీగఢ్: తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఇంటి ముట్టిడికి యత్నించిన స్కూల్ టీచర్లపై పోలీసులు భాష్పవాయువు, వాటర్ కెనాన్లను ప్రయోగించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టెంపరరీ టీచర్స్ యూనియన్ కొన్ని రోజులుగా మొహాలిలోని పంజాబ్ స్కూల్ ఎడ్యూకేషన్ బోర్డు భవనం ముందు నిరసన చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో సీఎం అమరీందర్ సింగ్ అధికారిక నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే టెంపరరీ టీచర్లందరూ సీఎం ఇంటి ముట్టడికి సోమవారం బయల్దేరారు. వాళ్లను అడ్డుకునేందుకు పోలీసులు చండీగఢ్-మొహాలీ సరిహద్దు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని తోసుకుని ముందుకు కదిలేందుకు యత్నించిన టీచర్లపై పోలీసులు భాష్పవాయువు, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరింత పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఉద్రిక్తతలో పలువురు టీచర్లకు గాయాలైనట్టు ఉపాధ్యాయ యూనియన్ వెల్లడించింది.