షాకింగ్ : ఆఫ్ఘన్‌లో వాటర్ బాటిల్ రూ.3000, ప్లేట్ మీల్స్ రూ.7400కు పైమాటే..!

by Anukaran |
kabool-airport
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల సామ్రాజ్యం ఏర్పాటయ్యాక అక్కడ పరిస్థితులు పూర్తిగా చేజారిపోయాయి. సాధారణ పౌరులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు విదేశాలకు వలస పోతున్నారు. ఒకవేళ అక్కడ ఉందామనుకున్నా ప్రజలు జీవించేందుకు ఆస్కారం లేకుండా పోతోంది. కారణం ప్రస్తుతం అక్కడ సింగిల్ వాటర్ బాటిల్ రూ.3000కు అమ్ముతుండగా.. ప్లేట్ మీల్స్ రూ.7400కు విక్రయిస్తున్నారు.

ఓ ఆఫ్ఘన్ పౌరుడు న్యూస్ ఏజెన్సీ రాయిటల్స్‌తో మాట్లాడుతూ.. ఇక్కడ పరిస్థితులు పూర్తిగా క్షీణించాయని అని చెప్పాడు. వ్యాపారులు, సామాన్యులు, అధికారులు అందరూ ఈ దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఫలితంగా కాబూల్ ఎయిర్ పోర్టులో ఒక బాటిల్ వాటర్ $ 40 (దాదాపు ₹ 3,000) మరియు ఒక ప్లేట్ రైస్ $ 100 (₹ 7,400 కంటే ఎక్కువ)కు అమ్ముతున్నారు.’’ అని వివరించాడు. ఈ ధరలు ‘‘సాధారణ ప్రజలకు అందుబాటులో లేవు’’ అని చెప్పుకొచ్చాడు. తాలిబాన్లు దేశాన్ని స్వాధీనం తర్వాత ఎవరూ ఇక్కడ నివసించేందుకు ఇష్టపడటం లేదని వెల్లడించాడు. అందువల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed