- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీహెచ్‌ఎంసీ పార్కులో వాచ్‌మెన్ పెత్తనం
దిశ, కూకట్పల్లి: ప్రజలకు అహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాల్సిన పార్కులో ప్రైవేటు వ్యక్తుల పెత్తనం కొనసాగుతుంది. మూసాపేట్ సర్కిల్ పరిధి కేపీహెచ్బీ డివిజన్ మూడవ ఫేజ్‌లో ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కును ప్రజలు వినియోగించుకోవాలంటే భయపడుతున్నారు. పార్కు కాపలాగ ఉన్న వాచ్‌మెన్ పార్కులోని గదిలో నివాసం ఉంటూ పార్కును పూర్తిగా తన సొంత ఆస్థిలా వినియోగించుకుంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పార్కు బాగోగులు చూసుకోవలసిన వాచ్మెన్పార్కు అధ్వాన్నంగా తయారైన పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. అదే విధంగా పార్కు ప్రధాన గేటు ఎదురుగా రోడ్డు వరకు పెద్ద పెద్ద రాళ్లు పెట్టి ఎవరూ వాహనాలు పార్కింగ్ చేయకుండా అడ్డు పడుతున్నాడని, అడగడానికి వెళ్లితే గొడవ పెట్టుకుంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా పార్కు ఆవరణలో తమ ఇంటి సామాన్లు, బెంచీలు, చెట్లకు ఇంట్లో దుప్పట్లు ఆరబెట్టుకోవడానికి వినియోగించుకుంటున్నారు.
అంతే కాకుండా పార్కులోని బోర్ నీటిని బయటి వ్యక్తులకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితాలతో అలసిన వారు సేదతీరడానికి కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేస్తున్న పార్కులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు.