- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందమైన భార్యను చంపేందుకు సినిమాలు చూసి మర్డర్ ప్లాన్
దిశ, వెబ్‌డెస్క్ : అందమైన అమ్మాయి భార్య అయితే ఎవరు మాత్రం కాదనుకుంటారు. కానీ ఓ భర్త ఆమె అందాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఆమె అందంతో అందరితో ఎఫైర్ పెట్టుకుంటుందని అనుమానించాడు. ఆ అనుమానమే అతడిలో సైకోయిజాన్ని లేపింది. అందమైన భార్యను లేకుండా.. మరెవరికి సొంతం కాకుండా చేయాలని మర్డర్ ప్లాన్ చేశాడు. ఇందుకోసం సినిమాలను చూసి అందులో హత్య చేసిన విధంగా చేయాలని కంత్రీగా ఆలోచించి పథకం అమలు చేశాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన సినిమా ట్విస్ట్‌లను తలపించింది. పోలీసుల కథనం ప్రకారం..
బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్‌లో నివాసం ఉండే ఫైనాన్స్ వ్యాపారి బీఆర్.కాంతరాజు(40)కు భార్య రూప(32) ఉన్నది. రూప పేరుకు తగ్గటే చాలా అందగత్తె. ఆమెను చూసిన వారెవరూ ఆ రూపాన్ని మర్చిపోలేరు. ఆ రూపమే ఆమె పాలిట శత్రువు అయింది. ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపే భర్త.. రూప అందాన్ని చూసి అనుమానపడ్డాడు. ఆమె అందానికి అందరూ ఫిదా అవుతారని, రూప ఇతరులతో అక్రమ సంబంధం నెరుపుతుందని అనుమానించాడు. ఆమె ఎవరితో మాట్లాడినా అనుమానంగా చూసేవాడు. చివరకు తోబుట్టువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడినా వారితో ఎఫైర్ ఉందని ఉహించుకునే వాడు. ఈ క్రమంలో అతడి ఆలోచనలు మొత్తం రూప అందం, అనుమానాల చుట్టే తిరిగి మానసికంగా కృంగిపోయాడు. ఆమె అందం మరొకరికి దక్కకూడదని భార్యను హత్య చేసేందుకు నిర్ణయించుకున్నారు.
భార్యను ఎలా చంపాలో తెలియక రెండు కన్నడ సినిమాను చూశాడు. వాటిల్లో మాదిరిగా కేసు తనపై రాకుండా ఉండేలా రెండు మర్డర్ ప్లాన్లు చేశాడు. మొదటి ప్లాన్ ప్రకారం భార్యను టూర్‌కు తీసుకెళ్లి ఎత్తైన కొండమీదనుంచి కిందకు తోసి చంపటం.. దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించటం. ఇది ఫెయిల్ కావడంతో రెండవ ప్లాన్ అమలు చేశాడు. దాని ప్రకారం.. రెండు కార్లు ఢీకొని ఒక కారులో ఉన్న భార్య చనిపోయేలా చేయడం.. కానీ రెండు మర్డర్ ప్లాన్లు ఫెయిల్ అయ్యాయి. ఇదే సమయంలో రూప తన పుట్టింటి వాళ్లు 14 మందితో కలిసి చిక్‌మంగ్‌ళూరుకు మూడు రోజుల టూరుకు వెళ్లింది. ఆమెతోనే వెళ్లిన బీఆర్.కాంతరాజు.. అక్కడి వాళ్లందరితో రూప సంతోషంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. అక్కడే తన బంధువులైన ఇద్దరు యువకులతో కలిసి రూప డ్యాన్స్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
టూర్ నుంచి ఇంటికి రాగానే ఆమెతో గొడవకు దిగాడు. నీకు అందరితో అక్రమ సంబంధాలు ఉన్నాయని, అందుకే డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావని ఘర్షణకు దిగాడు. అయితే వాళ్లంతా తన బంధువులని, తాను అలాంటి దాన్ని కాదని ఎంత నచ్చజేప్పిన భర్త వినలేదు. నీ అందంతో అందరిని వలలో వేసుకుంటున్నావంటూ స్క్రూడ్రైవర్ తీసుకుని ఆమె గొంతులో దింపాడు. అయినా కోపం చల్లారక కూరగాయలు కోసే కత్తితో ఆమె మెడకోసి పరారీ అయ్యాడు.
ఆ తర్వాత ఇంటికి వచ్చిన రూప మామ రామకృష్ణ బెడ్ రూంలో కోడలి మృతదేహాన్ని చూసి షాక్ అయ్యాడు. అనంతరం రూప చెల్లెలుకు మర్డర్ విషయం చెప్పాడు. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కాంతరాజు కోసం గాలింపు చర్యలు చేప్టటారు. కాంతరాజు అవసరమైన సమయంలో ఫోన్ ఆన్ చేసి మాట్లాడి వెంటనే స్విచ్ ఆప్ చేస్తూ పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు. ఈక్రమంలో అతడి వద్ద డబ్బులు అయిపోవడంతో స్నేహితుడికి ఫోన్ చేసి డబ్బులు అడిగాడు. ఆ ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేసిన పోలీసులు అతడు స్నేహితుడి దగ్గరకు రాగానే మాటు వేసి పట్టుకున్నారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నది.