VACCINE తీసుకుంటే.. వాషింగ్ మిషిన్ ఫ్రీ

by Shamantha N |   ( Updated:2021-10-09 01:40:56.0  )
VACCINE తీసుకుంటే.. వాషింగ్ మిషిన్ ఫ్రీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేందుకు కృషి చేస్తున్నాయి. అయితే, ఇప్పటికీ కొందరు వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకురావడం లేదు. అలాంటి వారికి వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఆదివారం జరిగే మెగా డ్రైవ్ లో టీకా తీసుకునేవారికి గిఫ్ట్‌లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో పాల్గొన్న వారి వివరాలను నమోదుచేసుకొని లక్కీ డ్రా ద్వారా విజేతలను ప్రకటిస్తామని కరూర్ జిల్లా కలెక్టర్ టి.ప్రభు శంకర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మొదటి మూడు స్థానాల విజేతలకు వాషింగ్‌మెషిన్, వెట్‌ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్ ఇవ్వనుండగా.. 24 ప్రెజర్‌ కుక్కర్లు, 100 ప్రోత్సాహక బహుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా టీకా తీసుకునేందుకు ప్రజలను తీసుకొచ్చేవారికి ఒక్కరికి రూ.5 ఇస్తామన్నారు.

Advertisement

Next Story