- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో పేలిన వాషింగ్ మెషీన్.. ఫోటోలు వైరల్
దిశ, వెబ్ డెస్క్ : మీ ఇంట్లో వాషింగ్ మెషీన్ ఉందా.. ఉంటే ఎప్పుడైనా.. వాషింగ్ మెషీన్ పేలడం గురించి విన్నారా. స్కాట్‌లాండ్‌లోని ఓ ఇంట్లో వాషింగ్ మెషీన్ పేలిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిదంటే.. స్కాట్‌లాండ్‌కు చెందిన లౌరా బిర్రెల్ అనే మహిళ ఇంట్లో పెద్ద పేలుడు ఘటన చోటుచేసుకుంది.
దీంతో ఒక్కసారిగా ఆమె.. తన ఇంటి వద్ద ఏదైనా బాంబు పేలిదేమోనని భయపడింది. ఇంతలో తేరుకుని, ఆమె వంటగదిలోకి వెళ్లి చూస్తే.. వాషింగ్ మెషీన్ పేలిపోయి ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురై కనిపించింది. వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసి వేరే పని చేసుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వాషింగ్ మెషీన్ పేలుడు అనంతరం అద్ధాలు పగిలిపోయి.. ఇళ్లంతా పొగతో నిండిపోయింది.
అయితే ఆ సమయంలో తాను అక్కడే ఉంటే నా ప్రాణాలు సైతం పోయి ఉండేవేమోనని తెలిపింది. మిషీన్ పేలుడు ఘటన ఫోటోలను ఆమె తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా.. మీలో ఎవరూ కూడా వాషింగ్ మెషీన్ ఆన్ చేసి బయటకు వెళ్లకండి అంటూ కామెంట్స్ చేసింది. తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డాను. ఆ సమయంలో నేను బయటకు ఎక్కడికి వెళ్లనందుకు సంతోషంగా ఉంది. లేకపోతే ప్రమాదం వల్ల నష్టం వాటిల్లేది. పేలుడు జరిగిన వెంటనే నేను స్విచ్ఛ్ ఆఫ్ చేశాను అని లౌరా ఫేస్‌బుక్‌లో పేర్కొంది.