తెలంగాణ ప్రజలకు హెచ్చరిక..

by Shyam |   ( Updated:2021-03-27 06:45:27.0  )
తెలంగాణ ప్రజలకు హెచ్చరిక..
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. మరో వైపు రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీకా తీసుకున్న వారికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఆయన ఈరోజు మాట్లాడుతూ.. తెలంగాణకు ఇప్పటివరకు 24,49,330 డోసుల టీకా వచ్చిందని ఆయన అన్నారు. 0.7 శాతం కరోనా టీకా వృథా అయిందని తెలిపారు.

రాష్ట్రంలో 12 లక్షల డోసుల టీకాలు వినియోగించామని తెలిపారు. కరోనా రెండో దశపై భయాందోళన అవసరం లేదని చెప్పారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా పండగల దృష్ట్యా కరోనా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. టీకా తీసుకున్న వారికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచించారు. కోవిడ్ రూల్స్ పాటిస్తూ హోలీ, రంజాన్ పండుగలు జరుపుకోవాలని కోరారు. ఇప్పుడున్న మ్యుటేషన్‌తో వైరస్ ఎక్కువ వ్యాప్తి జరుగుతోందని అన్నారు.

Advertisement

Next Story