- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గొర్రెకుంట హత్యల కేసు నిందితుడికి ఉరిశిక్ష
దిశ ప్రతినిధి, వరంగల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొమ్మిది హత్యల కేసులో నిందితుడు సంజయ్ కుమార్‌కు న్యాయస్థానం ఉరి శిక్ష ఖరారు చేసింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో జరిగిన తొమ్మిది హత్యలకు కారకుడైన నిందితుడికి జిల్లా కోర్టు ఉరిశిక్షను ఖరారు చేస్తూ బుధవారం తీర్పును వెల్లడించింది.
ఈ ఏడాది మే 21వ తేదీన వరంగల్ నగర శివారులోని గొర్రెకుంటలోని సాయి దత్త గన్ని బ్యాగ్స్ కంపెనీలో నిందితుడు తొమ్మిది మందికి మత్తు ఇచ్చి సృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో పడేసి హత్య చేశాడు. ఈ కేసులో బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్ పై 7సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. నెల రోజుల్లోనే కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో గీసుకొండ సీఐ శివరామయ్య సాక్ష్యాలు సేకరించి కోర్టులో సమర్పించారు. న్యాయస్థానంపై పూర్తి నమ్మకంతో ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలు తాజా తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.