నల్లమలలో పెద్దపులి సంచారం.. వీడియో వైరల్

by Shyam |   ( Updated:2023-06-14 02:33:36.0  )
నల్లమలలో పెద్దపులి సంచారం.. వీడియో వైరల్
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ నల్లమల అటవీప్రాంతంలో గత మూడు రోజులు వరసగా అటవీశాఖ సంరక్షణ అధికారులకు పెద్దపులి కంట పడినట్లు సమాచారం. ఈ విషయంపై అమ్రాబాద్ డివిజనల్ అధికారి రోహిత్ గొపిడిని ‘దిశ’ వివరణ కోరగా.. గతంతో పోల్చుకుంటే నల్లమల అడవుల్లో పెద్ద పులుల సంచారం సాఫీగా కొనసాగుతుందన్నారు. ఈ క్రమంలోనే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని మన్ననూర్ రేంజ్ పరిధిలోగల వ్యూ పాయింట్ సఫారీ రోడ్డు మార్గంలో శుక్రవారం మధ్యాహ్నం రేంజ్‌లో ఉన్న అటవీ అధికారులకు పెద్దపులి కనపడిందని తెలిపారు. ఆ సమయంలో అటవీ సిబ్బంది తమ చరవాణిలో పెద్దపులిని చిత్రికరించారనీ తెలిపారు. ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పెద్ద పులుల సంతానోత్పత్తి కోసం జతకట్టే కాలమని.. కావున వాటికి ఇబ్బంది కలగకుండ తగిన జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో పర్యాటకులకు, జంతు సందర్శుకులను అనుమతించకుండా సఫారీని తాత్కాలికంగా మూసివేశామని తెలిపారు. గతంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీల ఆధారంగా పెద్ద పులుల సంచారం గుర్తించే వారు. నేడు అడవిలో పెద్ద పులికి తగిన సౌకర్యాలు మెరుగుపడటంతో వాటి సమాచారం ప్రత్యక్షంగా అటవీశాఖ అధికారులు చూడటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed