- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న మరో సీనియర్ బౌలర్
దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ వాహాబ్ రియాజ్ 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నాడు. 36 ఏళ్ళ వాహాబ్ ఈ మధ్య పాకిస్తాన్ జట్టులో రెగ్యులర్‌గా చోటు సంపాదించుకోలేకపోతున్నాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ జట్టులో కూడా వాహాబ్‌కు చోటు దక్కలేదు. దీంతో వన్డే వరల్డ్ కప్ ఆడిన తర్వాత ఆటకు వీడ్కోలు పలకాలని వాహాబ్ నిర్ణయించుకున్నాడు. ‘ప్రతీ ఒక్కరు ఏదో ఒక రోజు ఆటకు వీడ్కోలు పలకాల్సిందే. నాకైతే 2023లో ఇండియాలోజరిగే వన్డే వరల్డ్ కప్ వరకు ఆడాలని ఉన్నది. నేను అప్పటి వరకు ఫిట్‌గా ఉండి నా కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్నాను’ అని వాహాబ్ చెప్పాడు. నాలోఇంకా రెండుమూడేళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉందని వాహాబ్ చెప్పుకొచ్చాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించకపోయినా దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇతర లీగ్స్ ఆడుతున్నట్లు వాహాబ్ చెప్పాడు. ఇప్పటి వరకు పాకిస్తాన్ తరపున 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.
- Tags
- cricket