- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాల్‌మనీ వేధింపులకు వీఆర్వో బలి?
దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లాలో కాల్‌మనీ వేధింపులు ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. కాల్‌మనీ వేధింపులు తాళలేక వీఆర్వో గౌస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎ. కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్‌గా గుర్తించారు. ప్రస్తుతం కొండపల్లి గ్రామ వీఆర్వోగా గౌస్ విధులు నిర్వహిస్తున్నారు. వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం గౌస్ కొంత అప్పు చేశారు. వడ్డీ డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ.. లక్షల్లో అప్పులు ఉన్నట్టు కాల్‌మనీ మాఫియా సృష్టించింది. వారి వేధింపులు తాళలేక సూసైడ్ లెటర్ రాసి కొండపల్లిలోని అద్దె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గౌస్ ఆత్మహత్యకు కారణమైన వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యుల పోలీసులను కోరారు. ఇకపోతే గతంలో లంచం తీసుకుంటూ గౌస్ ఏసీబీకి పట్టుబడినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.