- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటుకు నోటు కేసు విచారణ రేపటికి వాయిదా
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: ఓటుకు నోటు కేసులో తమను డిశ్చార్జ్ చేయాలని కోరుతూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉదయ్ సింహ వేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. ప్రజా ప్రతినిధుల కేసులను సత్వరమే తేల్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెల్సిందే. ఈ కేసుతో మాకెలాంటి సంబంధం లేనందున, మమ్ములను డిశ్చార్జ్ చేయాలంటూ సండ్ర, ఉదయ్ సింహాలు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు సంబంధించిన వాదనలు మంగళవారం ఏసీబీ కోర్టులో జరిగాయి. అయితే, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహాలకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్టుగా మా వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని ఏసీబీ అధికారులు వాదిస్తున్నారు. అంతే కాకుండా, నిందితులకు సంబంధించిన ఆడియో, వీడియోలు కూడా మా వద్ద ఉన్నట్టు చెబుతున్నారు. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికే డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారని కోర్టుకు తెలిపారు. అయితే నిందితుల తరుపు వాదనలు చేసేందుకు కేసు విచారణను ఏసీబీ కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.