- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యూజ్‌డ్ కార్ల విభాగంలో రెట్టింపు అమ్మకాలు: వోక్స్‌వ్యాగన్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ప్రీమియం కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ ఈ ఏడాది సెకెండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు రెండింతలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు వెల్లడించింది. గత కొంతకాలంగా దేశంలోని వినియోగదారులు యూజ్‌డ్ కార్లపై ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో తమ ప్రీ-ఓన్‌డ్ వాహన అమ్మకాలు 20,000 యూనిట్లకు చేరుకుంటాయని భావిస్తున్నట్టు కంపెనీ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా అన్నారు.
వోక్స్‌వ్యాగన్ సంస్థ 2012లో తన యూజ్‌డ్ కార్ల మార్కెట్లోకి ప్రవేశింది. గతేడాది కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత జూన్‌లో కంపెనీ తన ‘దస్ వెల్ట్ఆటో 3.0’ను ప్రారంభించింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ ద్వారా వినియోగదారులు యూజ్‌డ్ కార్ల అమ్మకాలు, కొనుగోళ్లు నిర్వహించవచ్చు. గత రెండేళ్లలో వినియోగదారుల ప్రాధాన్యతలో చాలా మార్పు వచ్చింది. కరోనా వల్ల వ్యక్తిగత వాహన అవసరం పెరిగింది. దీంతో కొత్త కారు కొనలేని వారు, ఇతర అవసరాలను పరిగణలోకి తీసుకుని యూజ్‌డ్ కార్లను కొనేవారు పెరగడం గమనిస్తున్నామని ఆశిష్ గుప్తా వివరించారు.
గతేడాది దాదాపు 10,000 ప్రీ-ఓన్‌డ్ కార్లను విక్రయించాం. ఈ ఏడాది 20 వేలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఓ నివేదిక ప్రకారం.. భారత్‌లో ప్రీ-ఓన్‌డ్ కార్ల మార్కెట్ 2025 నాటికి సుమారు 30-35 కోట్ల యూనిట్లకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కొత్త కార్ల మార్కెట్ కంటే దాదాపు 1.5-2 రెట్లు ఎక్కువని ఆశిష్ గుప్తా తెలిపారు.