- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వోగ్ మ్యాగజైన్‌పై ‘కెకె శైలజ’
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా పాండమిక్ ఈ ఏడాది ఎంతటి భయానక వాతావరణాన్ని సృష్టించిందో తెలియంది కాదు. ఈ క్రమంలోనే 2020 కొన్ని తరాలు మర్చిపోలేని సంవత్సరంగా నిలిచిపోనుంది. అయితే ఇంతటి కష్టకాలంలోనూ కొందరు మహిళలు ముందుండి సవాళ్లను దీటుగా ఎదుర్కొన్నారు. అవరోధాలను అధిగమించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. అటువంటి మహిళల ఘనతను, వారి శక్తిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ వోగ్.. ‘ఉమెన్ ఆఫ్ 2020’ స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొస్తోంది. కొవిడ్ వేళ కేరళ ఆరోగ్య మంత్రి కెకె శైలజ కృషికి గుర్తింపుగా, ఈ ప్రత్యేక సంచిక కవర్ పేజీపై ఆమె చిత్రాన్ని ప్రచురించింది ‘వోగ్’.
ప్రపంచమంతా కరోనా పాండమిక్‌తో సతమవుతున్న వేళ, సత్వరమే స్పందించిన కేరళ ఆరోగ్య శాఖ మంత్రి.. కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. తనకు అప్పటికే నిపా వైరస్ ఔట్‌బ్రేక్ టైమ్‌లో పని చేసిన అనుభవం ఉండటంతో ఆమె త్వరితగిన స్ట్రాటజీస్ అమలు చేసింది. ‘టెస్ట్, ట్రేస్, ఐసోలేట్ అండ్ సపోర్ట్’ అనే సింపుల్ ఐడియాను ఫాలో అయిన మంత్రి.. కేరళలో కరోనాను అదుపులో ఉంచి అందరి మన్ననలు అందుకుంది. కరోనా ప్రబలిన 100 రోజుల వరకు ఒక్క డెత్ కేసు కూడా అక్కడ నమోదు కాలేదు. అంతేకాదు ప్రపంచంలోనే బెస్ట్ రికవరీ రేటులో కేరళనే ముందంజలో ఉంది. కాగా పాండమిక్ టైమ్‌లో ఆమె ప్రజల సంక్షేమమే ప్రధానంగా ముందుకు సాగింది. ప్రజలను ఏ సమయంలో కలవడానికైనా అభ్యంతరం చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన కృషిని ఐరాసతో పాటు డబ్ల్యూహెచ్‌వో కూడా గుర్తించాయి. ఇక యూకే మ్యాగజైన్ సైతం ‘వరల్డ్స్ టాప్ థింకర్ 2020’ అంటూ శైలజను గౌరవించింది. అంతేకాదు న్యూజిలాండ్ పీఎం జెసిండా నుంచి ప్రశంసలు అందుకున్న శైలజను తాజాగా వోగ్ మ్యాగజైన్ గౌరవించడం విశేషం. ప్రతిసారి మోడల్స్‌తో ముఖచిత్రాన్ని ప్రింట్ చేసే వోగ్.. ఈసారి కెకె శైలజ ఫొటోను ప్రింట్ చేసింది. ‘ఉమెన్ ఆఫ్ 2020’ ప్రత్యేక సంచికలో కేరళ నర్స్ రేష్మ మోహన్ దాస్, తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ రేమ రాజేశ్వరి, చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్, డాక్టర్ కమలా రామ్మోహన్ పేర్లు కూడా ఉన్నాయి.