- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీఐలో మూవీ రెంటల్ సర్వీస్
దిశ, ఫీచర్స్: వోడాఫోన్ ఐడియా (వీఐ) తన కొత్త ‘పే పర్ వ్యూ’ మోడల్‌ను వీ-మూవీస్, టీవీ యాప్‌తో విడుదల చేసింది. గతంలో వోడాఫోన్ ప్లే, ఐడియా మూవీస్ & టీవీగా ఉండగా, ప్రస్తుతం ఈ అప్లికేషన్ ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ (పీవీఓడి) సేవలను అందిస్తోంది. ఈ క్రమంలోనే తమ వినియోగదారులకు సూపర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ‘టెనెట్, స్కూబ్’తో పాటు మరిన్ని బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించనున్నారు.
ప్రీమియం సినిమాలకు వీఐ వినియోగదారులు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానంలో ప్రీమియం మూవీస్‌ను రెంట్‌కు తీసుకునేందుకు అవకాశం ఉండగా, వన్ టైమ్ పర్చేస్ త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వీఐ తెలిపింది. వీఐ మూవీస్, టీవీ యాప్ తమ కస్టమర్లకు 380+ సినిమాలను అందుబాటులో ఉంచగా.. వీటిలో జోకర్, బర్డ్స్ ఆఫ్ ప్రే, స్కూబ్, ఆక్వామన్, క్రిస్టోఫర్ నోలన్ న్యూ మూవీ ‘టెనెట్’ వంటి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్‌లు ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు వంటి నాలుగు భాషల్లో వీటిని చూడొచ్చు.
వినియోగదారులు ప్రస్తుతం రీఛార్జ్ లేదా పోస్ట్-పెయిడ్ ప్లాన్‌ల ప్రకారం అదనపు ఖర్చు లేకుండా కంటెంట్‌ను చూస్తున్నారు. అయితే ఈ కొత్త ‘పే పర్ వ్యూ’ మోడల్‌లో మాత్రం తమకు నచ్చిన భాషలో, వారు చూడాలనుకునే కంటెంట్ కోసం అదనంగా డబ్బులు చెల్లించాలి. ఈ క్రమంలోనే ఒక్కో సినిమాకు రూ. 60- 120 వరకు చెల్లించాల్సి ఉండగా, అద్దెకు తీసుకున్న 48 గంటల్లోనే వాటిని చూడాల్సి ఉంటుంది. ఇందులో పెయిడ్ మూవీస్ కాకుండా 13 వేర్వేరు భాషల్లోని 9,500కి పైగా సినిమాలు, 300కి పైగా లైవ్ టీవీ చానెల్స్‌తో పాటు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, ఇంటర్నేషనల్ టీవీ షోలను కూడా వినియోగదారులు వీక్షించే వీలుంది.