విశాఖ ఎమ్మెల్యే‌కు సంకేళ్లు.. నిరసన

by srinivas |   ( Updated:2020-07-03 06:32:01.0  )
విశాఖ ఎమ్మెల్యే‌కు సంకేళ్లు.. నిరసన
X

దిశ ఏపీ బ్యూరో: చేతులకు సంకెళ్లతో టీడీపీ విశాఖపట్టణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బీసీలు ఎస్సీలకు రాష్ట్రంలో స్థానం లేదని అన్నారు. బీసీలను హంతకుల మాదిరిగా చిత్రీకరించి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, యనమల తదితరులపై తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. ఇప్పుడు కొల్లు రవీంద్రపై కూడా తప్పుడు కేసులు పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నారన్నారు. మంచిపేరున్న టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ బురదజల్లే ప్రయత్నంలో ఉందని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు 65 మంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని ఆయన మండిపడ్డారు.

Advertisement

Next Story