- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వీవోనే స్పాన్సర్.. స్పష్టం చేసిన బీసీసీఐ
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా చైనా మొబైల్ కంపెనీ వీవో కొనసాగుతుందని బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియాకు శుక్రవారం ఒక లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వీవో తప్పుకుంటుందనే వార్తలు వచ్చాయి. అయితే వీవోతో గతంలో ఉన్న ఒప్పందాన్ని కొనసాగించడానికే బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. డ్రీమ్ 11తో కేవలం తాత్కాలిక ఒప్పందం మాత్రమే జరిగిందని ఆయన పేర్కొన్నారు. త్వరలో జరగబోయే 14వ సీజన్‌ను వీవో ఐపీఎల్‌గా పిలవనున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 18న చెన్నైలో జరగబోయే మినీ వేలంలో కూడా వీవో ఐపీఎల్‌గానే వ్యవహరిస్తామని చెప్పారు.
కాగా, వీవోతో బీసీసీఐ 5 ఏళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది చైనా, ఇండియా ఉద్రిక్తల నేపథ్యంలో వీవోను తాత్కాలికంగా పక్కన పెట్టి డ్రీమ్11ను టైటిల్ స్పాన్సర్‌గా తీసుకున్నది. వీవోతో ఐదేళ్లకు గాను రూ. 2190 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నది. అంటే ఏడాదికి దాదాపు రూ. 440 కోట్లు వీవో చెల్లిస్తున్నది. వీవోతో బీసీసీఐకి 2022 వరకు ఒప్పందం ఉన్నది.