- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీబీఐ, వైఎస్ వివేకా అనుచరుల నుంచి ప్రాణ హాని ఉంది..ఎస్పీకి ఓ వ్యక్తి ఫిర్యాదు
దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. సీబీఐ, వైఎస్ వివేకా అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పను కలిశారు. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. వైఎస్ వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రూ.10 కోట్లు ఇస్తామని సీబీఐ ఆఫర్ చేసిందని గంగాధర్ రెడ్డి వెల్లడించారు. వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని సీబీఐ ఒత్తిడి తెస్తోందని ఎస్పీ వద్ద వాపోయాడు.
వారి ఒత్తిడితోనే వివేకాను తాను చంపానని ఒప్పుకోవాలని సీబీఐ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా తనపై సీబీఐ ఒత్తిడి తెస్తోందని లేని విషయాన్ని ఎలా చెప్తానని చెప్పుకొచ్చాడు. వైఎస్ వివేకా హత్య కేసులో బెదిరింపులపై గంగాధర్ రెడ్డి తనకు ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. గంగాధర్‌రెడ్డికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
సీబీఐ, వివేకా అనుచరులు, సీఐ శ్రీరాంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామన్నారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు గంగాధర్ రెడ్డి చెప్తున్నారని..గంగాధర్ రెడ్డి ఫిర్యాదులోని అన్ని అంశాలపై విచారణ జరుపుతామని ఎస్పీ ఫకీరప్ప తెలిపారు.
- Tags
- Gangadhar