- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విస్మయ హత్య కేసు: సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం.. ఆమె భర్తను
దిశ, వెబ్‌డెస్క్: కేరళలో సంచలనం సృష్టిస్తోన్న విస్మయ కేసులో ఆ రాష్ట్ర ప్రభుతక్కువం సంచలన నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ భార్యను అదనపు కట్నం కోసం వేధించిన భర్త కిరణ్ కుమార్ ను ఉద్యోగం నుంచి తీసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ ఆదేశాలు జారీచేశారు. వివరాలలోకి వెళితే.. గత కొన్ని రోజులుగా కేరళలోని వివాహిత విస్మయ అనుమానస్పద మృతి సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. కొల్లాం జిల్లాకు చెందిన మోటార్ వెహికిల్స్ ఇన్ స్పెక్టర్ కిరణ్ కుమార్ కు కడక్కల్ కు చెందిన 23 ఏళ్ల విస్మయ నాయర్ కు గతేడాది మార్చి లో వివాహం జరిగింది. వివాహ వేళలో కట్నంగా 800 గ్రాముల బంగారంతో పాటు ఒక ఎకరం ఖరీదైన పొలం.. లగ్జరీ కారును అప్పజెప్పారు. వీటితో ఏ మాత్రం సంత్రప్తి పడని అతడు.. అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు.
సైకోలా ప్రవర్తిస్తూ భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తూ ఒకరోజు కూతురిని చూసి వెళ్లేందుకు అల్లుడి ఇంటికి వెళ్లిన విస్మయ తల్లిదండ్రుల ముందే ఆమెను కొట్టడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ పెద్దల రాజీతో మళ్లీ విస్మయ కాపురానికి వెళ్ళింది. తరువాత కూడా అతనిలో మార్పు రాలేదు కదా ఇంకా ఎక్కువయ్యాయి. ఈ వేధింపుల్ని తట్టుకోలేని విస్మయ.. తనను ఇబ్బంది పెడుతున్న భర్త వైనానికి సంబంధించిన ఫోటోల్ని పుట్టింటి వారికి పంపింది. అలా పంపిన కొద్దీ గంటలకే విస్మయ అనుమానాస్పదంగా బాత్ రూమ్ లో విగతజీవిగా కనిపించింది.
తన కూతురుని అదనపు కట్నం కోసం ఆమె భర్త, అత్తామామలే హత్యచేసినట్లు విస్మయ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసు కేరళలో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ నేపథ్యంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కిరణ్ వాంగ్మూలాన్ని సేకరించిన అధికారులు.. అతడు సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నట్లుగా గుర్తించారు. అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరిగింది. తాజాగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ స్వయంగా స్పందించి.. కిరణ్ ను ఉద్యోగ బాధ్యతల్ని తప్పించి.. అతడ్ని సస్పెండ్ చేశారు.