- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వలంటీర్ కుటుంబానికి 5 లక్షల పరిహారం: జగన్
కరోనా నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తూ ఆకస్మికంగా మృతి చెందిన వలంటీర్ కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. దాని వివరాల్లో వెళ్తే… విశాఖపట్టణం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు మండలంలోని తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ వలంటీర్ గబ్బాడ అనురాధ (26) గుండెపోటుతో మృతిచెందింది. ఈ విషాయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి, సీఎంఓ అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఆరాతీశారు. దీంతో ఆమెకుటుంబానికి అండగా నిలుస్తామని, 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. వెంటనే ఈ సహాయం వారి కుటుంబ సభ్యులకు అందేలా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో తక్షణ సాయంగా స్థానిక ఎమ్మెల్యే పది వేల రూపాయలు వారికి అందించారు.
tags: volunteer dead, sudden death, visakhapatnam district, agency, paderu, anuradha