చిరంజీవి చిత్ర పటానికి ఉక్కు కార్మికుల పాలాభిషేకం

by srinivas |
megastar chiranjeevi
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు పరిశ్రమ కార్మికులు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఉక్కుపోరాట సమితి, కార్మిక సంఘాలు నిరసన దీక్షలు చేపట్టాయి. కార్మికుల నిరసనలకు మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే తన మద్దతు ప్రకటించారు. దాంతో చిరంజీవికి కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు. చిరు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చిరంజీవి, కేటీఆర్ తరహాలో ఇతర ప్రముఖులు కూడా తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కార్మికులు కోరారు. ఉక్కు సంకల్పంతో ఉక్కు పరిశ్రమను కాపాడుకుందామని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story